ఫోన్ పోయిందా? వెంటనే ఈ చర్యలు తీసుకోండి! 23 d ago
మీ ఫోన్ పోయినట్లయితే, ముందుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. తర్వాత *సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR)* వెబ్సైట్లో *Block Stolen/Lost Mobile* ఆప్షన్ ద్వారా ఫోన్ బ్లాక్ చేయండి. ఫోన్ నంబర్, IMEI నంబర్, ఫిర్యాదు నంబర్, కొనుగోలు రసీదు వంటి వివరాలు అందించాలి. CEIR 24 గంటల్లో మీ ఫోన్ను బ్లాక్ చేసి, ఎవరైనా కొత్త సిమ్ ఉపయోగిస్తే పోలీసులకు అలర్ట్ చేస్తుంది. ఫోన్ తిరిగి లభిస్తే, అదే సైట్లో అన్బ్లాక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వేల ఫోన్లు ఇలా ట్రేస్ అవుతున్నాయి.